140
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. 
1 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. 
కృ-రుల నుండి నన్ను కాపాడుము. 
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. 
వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు. 
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి 
వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది. 
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. 
కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు. 
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. 
నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. 
నా దారిలో వారు ఉచ్చు పెడతారు. 
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. 
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. 
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. 
నీవు ఇనుప టొపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు. 
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. 
వారి పథకాలు నెగ్గనీయకు. 
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. 
ఆ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము. 
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. 
నా శత్రువులను అగ్నిలో పడవేయుము. 
వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము. 
11 యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. 
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. 
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. 
నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. 
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను. 
నీ సన్నిధానంలో వారు నివసిస్తారు. 
