149
1 యెహోవాను స్తుతించండి. 
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! 
ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. 
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. 
సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. 
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ 
నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. 
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. 
దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. 
ఆయన వారిని రక్షించాడు! 
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. 
పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి. 
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. 
ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని 
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. 
వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. 
8 ఆ రాజులకు, ప్రముఖులకు 
దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. 
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. 
దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. 
యెహోవాను స్తుతించండి! 
