130
యాత్ర కీర్తన. 
1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. 
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. 
2 నా ప్రభువా, నా మాట వినుము. 
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము. 
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే 
ఒక్క మనిషి కూడా మిగలడు. 
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము. 
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు. 
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. 
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. 
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను. 
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. 
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను. 
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. 
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. 
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు. 
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు. 
