128
యాత్ర కీర్తన. 
1 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు. 
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు. 
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు. 
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి. 
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది. 
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు. 
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. 
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశీస్తున్నాను. 
నీవ నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను. 
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను. 
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక. 
