13
1 యోబు ఇలా అన్నాడు: 
“ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి. 
మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను. 
అదంతా నేను గ్రహించాను. 
2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు. 
నేను మీకంటే తక్కువ కాదు. 
3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) 
సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలిని నేను కోరు తున్నాను. 
నా కష్టాల గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను. 
4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. 
ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు. 
5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. 
అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని. 
6 “ఇప్పుడు, నా వాదం వినండి. 
నేను నా విన్నపం చెబుతుండగా, వినండి 
7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? 
మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి మీరు చెప్పు తున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ము చున్నారా? 
8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? 
న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా? 
9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే 
ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా? 
మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని 
నిజంగా అనుకొంటున్నారా? 
10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని 
రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు. 
11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుది. 
ఆయన్ను చూచి మీరు భయపడతారు. 
12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు తున్నాం అనుకొంటారు). 
కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే. 
13 “నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. 
అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ నివ్వండి. 
14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను, 
నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను. 
15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను. 
ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను. 
16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. 
చెడ్డ మనిషీ ఎవ్వరూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసు కోడానికి సాహసించరు. 
17 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 
నేను వివరిస్తూండగా నీ చెవులను విననివ్వవు. 
18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 
నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను. 
నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు. 
19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు. 
అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను. 
20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము. 
అప్పుడు నేను నీవద్ద దాగుకొనను. 
21 నన్ను శిక్షించడము ఆపివేయి. 
నీ భయాలతో నన్ను బెదిరించకు. 
22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను. 
లేదా నన్ను నీతో మాట్లాడనివ్వు. నీవు నాకు జవాబు ఇవ్వు. 
23 నేను ఎన్ని పాపాలు చేశాను? 
నేను ఏం తప్పు చేశాను? 
నా పాపాలు, నా తప్పులు నాకు చూపించు. 
24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? 
నన్ను నీ శత్రువులా ఎందుకు చూస్తూన్నావు? 
25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా? 
నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును. 
ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు దాడిచేస్తున్నావు. 
26 దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు. 
నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు. 
జోఫరుకు యోబు జవాబు 
27 నా సాదాలకు నీవు గొలుసులు వేశావు. 
నేను వేసే ప్రతి అడుగూ నీవు జాగ్రత్తగా గమనిస్తున్నావు. 
నా అడుగలను నీవు తక్కువ చేస్తున్నావు. 
28 అందుచేత కుళ్లిపోయిన దానిలా, 
చిమ్మెటలు తిని వేసిన గుడ్డ పేలికలా 
నేను నిష్ప్రయోజనం అయిపోతున్నాను.” 
